మహానటిపై విరుచుకుపడ్డ జెమిని గణేషన్ కూతురు..!

gemini-ganeshan-mahanati-da

సావిత్రి బయోపిక్ మహానటి సినిమాపై అందరు ప్రశంసలు అందిస్తుంటే ఒకరు మాత్రం మహానటి సినిమాపై విరుచుకు పడుతున్నారు ఆమె ఎవరో కాదు జెమిని గణేషన్ కూతురు కమలా సెల్వరాజ్. జెమిని గణేషన్ పాత్రపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళ పరిశ్రమలో ఎం.జి.ఆర్, శివాజి గణేషన్ తర్వాత తన తండ్రి జెమిని గణేషన్ కు అంత క్రేజ్ ఉందని అలాంటిది మహానటి సినిమాలో చాలా చులకనగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాదు సావిత్రికి మందు అలవాటు తన తండ్రి చేయించినట్టు చూపించారని. ఆమె అవసాన దశలో పెద్ద వాళ్లెవరు ఆమెను పట్టించుకోలేదని చూపారని. సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను కాపాడేందుకు పెద్ద వాళ్లు వచ్చారని వాటిని చూపించకపోవడం ఏమాత్రం భావ్యంగా లేదని అన్నారు కమల్ సెల్వరాజ్.

మందుకి బానిసగా మారినప్పుడు తన తండ్రి ఆమెను మందలించడానికి వెళ్లారని అప్పుడు తన తండ్రి జెమిని గణేషన్ తో తాను కూడా ఉన్నానని కాని మమ్మల్ని కనీసం లోనికి రానివ్వకుండా వాచ్ మెన్ చేతనే బయటకు పంపించారని అన్నారు కమల్ సెల్వరాజ్. చూస్తుంటే ఈ వివాదంపై ఆమె నోరి పెద్దది చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a comment