Gossipsజ‌క్క‌న్న శిష్యుల‌కు లైఫ్ లేదా..!

జ‌క్క‌న్న శిష్యుల‌కు లైఫ్ లేదా..!

అమ్మ దీవెన ఆకాశమంత .. దేవుని దీవెన దీపమంత అన్నట్లుగా ఉంది టాప్ డైరెక్షర్ రాజమౌళి అసిస్టెంట్ల పరిస్థితి. దర్శకుడిగా అందరిచేత శభాష్ అని మన జక్కన్న అనిపించుకుంటుంటే ..ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు మాత్రం అయ్యో పాపం అని అనిపించుకుంటున్నారు. వారి పరిస్థితి చూసి రాజమౌళి కూడా లోలోపల ఆందోళన చెందుతున్నాడు. అంత టాప్ డైరెక్షర్ దగ్గర పనిచేసిన వారి అసిస్టెంట్లకు అసలు ఏమైంది ..? వారి పరిస్థితి చూసి అందరూ ఎందుకు జాలిపడుతున్నారో తెలుసుకుంటే మనకి కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుంది.

రాజమౌళి అంటే ఒక బ్రాండ్ .. ఆ బ్రాండ్ కి ఇప్పటివరకు అపజయం అంటే ఏంటో తెలియదు. ఆయన ఏ సినిమా తీసినా అందులో హీరో కనిపించడు ఆ పాత్ర తీర్చిదిద్దిన జక్కన్నే కానిపిస్తాడు. అంత గొప్ప దర్శకుడు ఆయన. కానీ ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్షర్ ల పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. వారు ఏ సినిమా చేసినా అది ప్లాప్ అవుతోంది. దీంతో వారికీ వాళ్ళ గురువు రాజమౌళికి కూడా ఆ మారక అంటుకుంటోంది.

నితిన్ – ప్రియమణి జంటగా నటించిన ద్రోణ సినిమా గుర్తుందా 2009 లో వచ్చిన ఆ సినిమాకి దర్శకుడు జే.కరుణ్ కుమార్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఆ సినిమా ఆడలేదు. 2011లో వచ్చిన ఆడు మగడ్రా బుజ్జి గుర్తుందా ? సుధీర్ బాబు హీరో. ఆ చిత్ర దర్శకుడు కృష్ణ రెడ్డి రాజమౌళి శిష్యుడు. ఈ సినిమా కూడా ఆడలేదు సరికదా ప్రేమకథ చిత్రం లాంటి బ్లాక్బస్టర్ తరువాత సుధీర్ కెరీర్ ను కూడా అగాధంలోకి నెట్టేసింది.

నాగశౌర్యతో దిక్కులు చూడకు రామయ్య తీసిన త్రికోటి కూడా రాజమౌళి శిష్యుడే, ఆ సినిమా కూడా ఫ్లాపే. ఇక తాజాగా లచ్చిందేవికి ఓ లేక్కుంది. ఈ సినిమా దర్శకుడు జగదీశ్ తలసిలా కూడా రాజమౌళి దగ్గర చేసినవాడే. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వం వహించిన ఏంజెల్ చిత్రం మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ప్రతిష్టాత్మక బాహుబలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పళని…సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఏంజెల్ ను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.గతంలో కూడా రాజమౌళి శిష్యులు తీసిన కొన్ని సినిమాలు అపజయాన్ని మూటగట్టుకున్నాయి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ఆ సినిమాతో తెరంగేట్రం చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా గత ఏడాది విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్షర్ లు అందరూ మంచి పేరు తెచ్చుకుని ఇండ్రస్ట్రీలో గురువు పేరు నిలబెడతారనుకుంటే వారు మాత్రం ఉన్న పేరు చెడగొట్టేలా అట్టర్ ప్లాప్ సినిమాలు తీస్తున్నారు. కానీ శిష్యుల నిర్వాకం పై జక్కన్న మాత్రం ఎక్కడా నోరు జారడంలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news