Newsషాక్ : తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన దాసరి నారాయణరావు.. ఐసీయూలో చికిత్స

షాక్ : తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన దాసరి నారాయణరావు.. ఐసీయూలో చికిత్స

Legendary film maker and politician Dasari Narayana Rao (74) admitted in ICU at KIMS Hospital, Hyderabad suffering with kidney related ailments.

టాలీవుడ్‌కి ఇది అతిపెద్ద షాకింగ్ న్యూస్. దర్శకరత్న, పొలిటీషియన్ కూడా అయిన దాసరి నారాయణరావు (74) తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. గతకొన్నాళ్ల నుంచి కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈరోజు (31-01-2017) ఉదయం హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

నిపుణులైన వైద్యబృందం ఆయనకు చికిత్స అందిస్తోందని.. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. రెండు, మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారని ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం. టాలీవుడ్‌కి గాడ్ ఫాదర్‌గా పరిగణించబడే ఆయన.. త్వరగానే కోలుకోవాలని కోరుకుందాం. రీసెంట్‌గానే జరిగిన ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దాసరి.. ఆకస్మికంగా అస్వస్థతకి గురికావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.

కాగా.. దాదాపు 150కి చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి, అత్యధిక సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా గిన్నిస్ రికార్డ్ సాధించారు. అంతేకాదు.. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు కూడా. అలాగే.. తెలుగు, తమిళం, కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news