Gossipsచైనా లో పదకొండు వందల కోట్లు వసూలు చేసింది .. కారణం...

చైనా లో పదకొండు వందల కోట్లు వసూలు చేసింది .. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇప్పటికే కేవలం చైనా దేశం లో ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా పదకొండు వందల కోట్ల డబ్బు కలక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంగ్లిష్ కాని సినిమాల రికార్డులలో దంగల్ చాలా పెద్ద రికార్డుని కొట్టేసింది. ఈ సినిమా అంతగా ఆమిర్ ఖాన్ తెలీని చైనా లో ఇంతపెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడివారి జీవన శైలి కూడా ఇలాగే ఉండదమట .

ఇండియాలో ఉన్నట్లే చైనాలోనూ అన్ని రకాల అంతరాలు భారీ స్థాయిలో ఉన్నాయి. జెండర్ బయాస్… పట్టణాలు, గ్రామాల మధ్య ఎంతో తేడా… పేద, ధనిక భేదాలు వంటివన్నీ చైనాలోనూ చాలా కామన్. ఈ సినిమాల్లో అవన్నీ కనిపిస్తాయి… అందుకే చైనావాళ్లు ఈ సినిమాను అంతగా నచ్చేశారు. అంతేకాదు… ఈ సినిమాపై చైనాలో ఆర్థికవేత్తలు కూడా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. దీనిపై చైనా మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

అన్ని రంగాల్లో చైనా, భారత్ ల మైత్రి దంగల్ సినిమాను స్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు. . ఒక గ్రామీణ యువతి అంతర్జాతీయం గా కుస్తీ పోటీలలో నిలిచి ఇంత పెద్ద సంచలనం రేపడం అనేది దంగల్ లో చూపించిన తీరు నెవెర్ బిఫోర్ అని చెప్పాలి. గ్రామ స్థాయి క్రీడలకి పెద్దగా ప్రాధాన్యం ఇస్తారు చైనా వారు. సో ఈ సినిమా అలాంటి కథాంశం తో రావడం వారికి ఫుల్ హ్యాపీ ఇస్తోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news