Gossipsబ్రేకింగ్ న్యూస్ : దగ్గుబాటి అభిరాంకు అవి లీక్ చేస్తామంటూ బెదిరింపు...

బ్రేకింగ్ న్యూస్ : దగ్గుబాటి అభిరాంకు అవి లీక్ చేస్తామంటూ బెదిరింపు కాల్స్..!

దగ్గుబాటి అభిరాం అదేనండి సురేష్ బాబు తనయుడు. రానా తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకునేలోగా శ్రీరెడ్డి ఇష్యూతో సీన్ రివర్స్ అయ్యింది. శ్రీరెడ్డితో సెల్ఫీలు దిగి మరి అభిరాం బుక్ అయ్యాడు. దీనిలో అతగాడి తప్పు లేకపోతే వెంటనే మీడియా ముందుకు వచ్చే వాడు. అఫ్కోర్స్ ఎలాగు ఆ మ్యాటర్ ఇప్పుడు సెటిల్ అయినట్టే అని అంటున్నారు. అది పక్కనపెడితే మళ్లీ అభిరాం రిస్క్ లో పడే వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది.

కొన్ని నెలల క్రితం అభిరాం మొబైల్ పోయిందట. ఐఫోన్ అన్ లాక్ చేయించుకుని మరి అందులోని ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తామని అభిరాం కు బెదిరింపు కాల్స్ చేస్తున్నారట. వ్యవహారం సురేష్ బాబు దాకా వెళ్లడంతో వెంటనే సైబర్ క్రైం లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకేముంది అలా బెదిరించిన వారిని పట్టేసుకున్నారు. వారిలో ఒకరు కూరగాయల వ్యాపారి కాగా ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయిస్ అని తేలింది.

అయితే వారు ఆ డేటాను ఇంకెక్కడైనా సేవ్ చేశారా.. నిజంగానే డిలీట్ చేశారా అన్నది తెలియలేదు. ఇంతకీ అసలు ఎవరెవరి ఫోటోలు, వీడియోలు అందులో ఉన్నాయో కూడా తెలియలేదు. మొత్తానికి ప్రసతుతం అభిరాం టైం ఏం బాగాలేదని చెప్పొచ్చు. కుర్రాడు కొద్దిరోజులు సైలెంట్ గా ఉంటే బెటరేమో లేదంటే రిస్క్ లో పడేందుకు ఇవన్ని అస్త్రాలుగా వాడుతారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news