Gossips"ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?" అసలు ఏమయ్యింది ..?

“ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?” అసలు ఏమయ్యింది ..?

నీకు బాగా బలుపు, నోటి దురుసు ఎక్కువ’ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ మాత్రం అస్సలు ఫీలవ్వరు. అసలు విషయమేంటి అంటూ జంకూ బొంకూ లేకుండా సమాధానం చెప్పేస్తారు తప్ప అటువైపు అడిగిన పెద్ద మనిషి ఎవరు అనేది మాత్రం ఆయన అస్సలు పట్టించుకోరు అది ఆయన స్టైల్.

తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మాధవ్ ఇప్పటివరకు ఎవరికీ తెలియని చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు ఇగో ఎక్కువని, తనను ఎవరూ బెదిరించలేరని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక సినిమా షూటింగులో తనకూ, ఓ పెద్ద హీరోకు మధ్య జరిగిన సంభాషణను కూడా వేణు వెల్లడించారు.

తాను ఒక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఆ సినిమా చేస్తోన్న ఓ పెద్ద హీరో తనను పిలిచి ఓ ప్రశ్న అడిగారని చెప్పారు.”ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?” అని ఆ హీరో.వేణుని అడిగారట. అంతేకాకుండా, ఆ విషయాన్ని తానును ప్రూవ్ చేస్తానని చెప్పి ఎవరికో ఫోన్ చేయబోయారట. అసలు విషయమేంటో క్లారిటీగా చెప్పండి సార్ అని వేణు..ఆ హీరోను అడిగారట. మళ్లీ ఆ హీరో అదే ప్రశ్న అడగడంతో… తాను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోనని, తన కాలుమీద కాలేసుకుని కూర్చుంటానని వేణు సమాధానమిచ్చాడట.

అది తప్పెలా అవుతుందని తిరిగి ఆ హీరోని ప్రశ్నించాడట. వేణు సమాధానం విన్న ఆ హీరో రెండు నిమిషాల పాటు సైలెంట్ గా ఉండిపోయారట. నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా .. సరే నీ ఇష్టం అలాగే కానీ అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడట. కానీ ఆ తరువాత ఆ హీరోకి నాకు మధ్య ఇంకా ఏ ప్రొబ్లెమ్స్ రాలేదు సరికాదా మేము ఇద్దరం కలసి చాలా సినిమాల్లో నటించాము అంటూ ఈ కమెడియన్ గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news