Gossipsరంగస్థలం కలక్షన్స్.. అవమానంగా భావిస్తున్న చిరంజీవి..!

రంగస్థలం కలక్షన్స్.. అవమానంగా భావిస్తున్న చిరంజీవి..!

రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఓ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవికి సంతోషాన్ని కలిగించినా మరో పక్క మెగాస్టార్ కు ఇది అసంతృప్తిని మిగిల్చిందని అంటున్నారు. అదెలా అంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 నాన్ బాహుబలి రికార్డులన్నిటిని పక్కన పెట్టేసి రికార్డ్ సృష్టించింది.

అయితే రాం చరణ్ రంగస్థలం ఆ రికార్డును ఎక్కువ రోజులు కూడా ఉంచలేదు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఏర్పరచిన యూఎస్ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రంగస్థలం సక్సెస్ సంతోష పరచినా ఓ హీరోగా ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం అవమానంగానే భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

సాటి హీరోగా చరణ్ తో పోల్చి చూడకుండా తండ్రికి తగ్గ తనయుడే అని రాం చరణ్ ప్రూవ్ చేసుకున్న విధానం మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరచేలా చేసింది. ఇక రానున్న సినిమాలతో రాం చరణ్ ఇదే రికార్డులను క్రియేట్ చేస్తారని గట్టిగానే చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news