Moviesవెంకీ ని చూసి ఏడ్చేసిన చిరంజీవి భార్య!!

వెంకీ ని చూసి ఏడ్చేసిన చిరంజీవి భార్య!!

కథను నమ్మి.. ఓకే చేసిన ఈ మూవీలో వెంకీ కనిపించే తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ తరహా సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. నెరిసిన గడ్డం.. నాన్న లాంటి వయసు అనే డైలాగ్ ను ఓకే చేయటం లాంటివి మామూలు విషయాలు కావనే చెప్పాలి. ఇలాంటి రిస్క్ ను తీసుకున్న వెంకీని ఇప్పుడు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

గురు చిత్రంలో వెంకీ పోషించిన పాత్రపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇలాంటి పాత్రను చేయటం రిస్క్ అని చెప్పటమే కాదు.. నువ్వు ఎప్పుడూ రిస్క్ ను తీసుకుంటావ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించటాన్ని ప్రస్తావించారు వెంకీ. అంతేకాదు.. తన చాయిస్ మెగాస్టార్ కి నచ్చిందని వెంకటేశ్ వెల్లడించారు. ఆయన మెగాస్టార్ గురించి ప్రస్తావిస్తే.. గురు డైరెక్టర్ సుధ అయితే.. చిరు వైఫ్ సురేఖ గురించిన ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు.

చాలామంది పలువురు సినీ ప్రముఖుల గురించి మాట్లాడుతుంటారు. ఎవరూ కూడా చిరు వైఫ్ గురించి అస్సలు ప్రస్తావించరు. కానీ.. గురు దర్శకురాలు సుధ.. చిరు వైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘చిరంజీవి వైఫ్ సురేఖ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. బాక్సింగ్ మూవీ కదా?ఏముంటుందిలే అని అనుకున్నారట. కానీ..సినిమా చూశాక మాత్రం.. ఇది బాక్సింగ్ మూవీ కాదు..మంచి ఎమోషనల్ మూవీ అని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగంతో ఏడ్చేశారు’’ అని వెల్లడించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news