ఖైదీ ఫంక్షన్‌కి పవన్ ఎందుకు రాలేదో చెప్పేసిన చిరంజీవి!!

chiranjeevi pawan kalyan

ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ చాలా చాలా గ్రాండ్‌గా జరిగింది. మరీ ముఖ్యంగా మెగా హీరోలందరూ వేదికపైన కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ ఆనందం మొత్తం చిరంజీవిలో కనిపించింది. చిరంజీవి కూడా అంతే ఉత్సాహంగా ‘హీరోయిజం నా ఇంట్లో ఉంటది…’ అనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించాడు. అంతా బాగానే ఉంది కానీ అదే మెగా ఇంట్లో ఉంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సభకు రాకపోవడం మాత్రం కాస్త వెలితిగా అనిపించింది. ఆ వెలితి కూడా కేవలం మీడియాకు, ఫ్యాన్స్‌కి మాత్రమే. కానీ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది.

ఇప్పుడంటే మీడియావాళ్ళందరూ కూడా పవన్ అక్కడికెందుకు రాలేదు…ఇక్కడికెందుకు రాలేదు? ఏవైనా గొడవలున్నాయా? విషయమేంటో? అని ఆరాలు తీస్తున్నారు గానీ అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం చిన్నప్పటి నుంచీ అలానే ఉంటుందట. ఆ విషయం కూడా చిరంజీవే చెప్పాడు. బేసిక్‌గా పవన్ ఇంట్రావర్ట్. ఒక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. ఇంట్లో మేమందరం కూడా సరదాగా కలుస్తూ ఉంటాం. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రం ఏదో ఒక రూంలోకి ఒక్కడే వెళ్ళి పుస్తకాలు చదువుకోవడమో….ఆలోచిస్తూ కూర్చోవడమో చేస్తూ ఉంటాడు. మెగా కుటుంబంలో ఎప్పుడూ విబేదాలు ఉండవని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కళ్ళం కూడా వేరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తామని…అలానే పవన్ అంటే కూడా మాకు చాలా గౌరవమని చెప్పుకొచ్చాడు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా పోటీ పడినా…..పాలిటిక్స్‌లో నాయకులుగా ఎదురెదురు పడాల్సి వచ్చినా….కుటుంబసభ్యులుగా మాత్రం ఎప్పటికీ మెగా ఫ్యామిలీ ఒక్కటిగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు చిరంజీవి. అయినా చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో చాలా సార్లు చెప్పాడు పవన్. అలాగే పవన్ పైన ఉన్న అభిమానాన్ని కూడా చాలా సార్లు చెప్పాడు మెగాస్టార్. వాళ్ళు వాళ్ళు చాలా బాగున్నారని…బాగుంటారని సినిమా పెద్దలు కూడా చెప్తున్నారు. మధ్యలో ఈ మీడియావాళ్ళే ఎందుకు అతి చేస్తున్నారో తెలియడం లేదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

More from my site