యండమూరి, వర్మలపై నాగబాబు చేసిన కామెంట్స్‌ మీద స్పందించిన చిరంజీవి

chiranjeevi responds on nagababu comments khaidi pre release event

Finally, megastar Chiranjeevi responds on Nagababu controversial comments in his latest interview.

గతంలో మునుపెన్నడూ లేని విధంగా మెగాబ్రదర్ నాగబాబు ‘ఖైదీ నెం 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. యండమూరి వీరేంద్రనాథ్, రాంగోపాల్ వర్మలను టార్గెట్ చేస్తూ ఆయన విరుచుకుపడ్డాడు. గతంలో రామ్ చరణ్‌ని తక్కువ చేస్తూ యండమూరి మాట్లాడినందుకు ఆయన్ను మూర్ఖుడిగానూ.. ‘ఖైదీ’ పోస్టర్లలతోపాటు టీజర్స్, పాటలపైనే కాకుండా చిరు ఎలా నటించాలి? ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై రాంగోపాల వర్మ ట్విటర్ వేదికగా సెటైరిక్ ట్వీట్లు చేయడంతో అతన్ని అక్కుపక్షిగా పేర్కొంటూ.. నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధంగా ఆయన చేసిన కామెంట్స్‌పై యండమూరి, వర్మ తమదైన స్టైల్లోనే స్పందించారు కానీ.. అది వేరే విషయం.

ఎప్పుడూ లేనంతగా నాగబాబు రెచ్చిపోవడంపైనే ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. ఎందుకలా ఆ ఇద్దరిపై ఆయన ఫైర్ అయ్యారు? ఆయనలా చేయడం కరెక్టేనా? ఎంచుకున్న వేదిక సరైందేనా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై మెగాఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతుంది? ముఖ్యంగా చిరు ఎలా స్పందిస్తారో? అనే క్యూరియాసిటీ నెలకొంది. చివరికి ఓ ఇంటర్వ్యూలో ఆయన నాగబాబు కామెంట్స్‌పై స్పందించారు. యండమూరి చేసిన కామెంట్స్ తొలుత తనని బాధపెట్టాయి కానీ ఆ తర్వాత తాను పట్టించుకోలేదని చెప్పిన చిరు.. నాగబాబు చాలా ఎమోషనల్ పర్సన్ అని, ఆ బాధని దిగమింగుకోలేక అలా వ్యాఖ్యానించాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈయన కూడా యండమూరి కామెంట్స్‌ని తప్పుపట్టారు.

వ్యక్తిత్వ వికాసంకి సంబంధించి క్లాసులు ఇస్తున్న సమయంలో ఒకరిని హైలైట్ చేయడం కోసం మరొకరిని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చిరు అన్నారు. అలాగే.. ఇంట్లో మహిళల పేర్లు ప్రస్తావించినప్పుడు సభాముఖంగా కనీస మర్యాదలుంటాయని.. అది యండమూరి పాటించకుండా ఇంట్లో సొంత మనిషిని పిలిచినట్లు తన సతీమణి పేరు సురేఖ అని అనడం సంస్కారమేనా? అని ప్రశ్నించారు. ఇక వర్మ గురించి కూడా చిరు మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారో.. క్రింది వీడియో చూడండి…

More from my site