‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్.. పంజా విసిరిన చిరు

chiranjeevi khaidi no 150 first day nizam collections

Chiranjeevi’s ‘Khaidi No 150’ movie has earned humongous collections which is said to be non-baahubali record.

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ అంచనాలకు తగ్గట్టుగానే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా 1.25 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ‘నాన్-బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఏపీ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ.. నైజాంలో మాత్రం ఈ చిత్రం ఓ కుమ్ముడు కుమ్మేసింది. భారీ ఓపెనింగ్స్‌తో గత సినిమాల రికార్డులను బద్దలుకొట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం తొలిరోజు నైజాంలో రూ.6.47 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ దెబ్బకు ‘బాహుబలి’ (రూ.6.28) రికార్డ్ కూడా బద్దలైపోయింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడంతో.. సినీజనాలు దీనికి బ్రహ్మరథం పట్టారు. అందుకే.. ‘ఖైదీ’ ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిందని అంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ చిత్రాన్ని.. రామ్ చరణ్ నిర్మించగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది.

More from my site