Movies‘ఖైదీ నెం.150’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఇంకా తగ్గని మెగాస్టార్...

‘ఖైదీ నెం.150’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఇంకా తగ్గని మెగాస్టార్ జోరు

Megastar Chiranjeevi’s 16 days worldwide collections report is out. According to trade, this movie has earned massive amount in 15, 16 days.

ఏ స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. తొలి 10 రోజుల వరకే అది బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేస్తుంది. ఆ తర్వాత ఆ సినిమా క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి.. సహజంగానే వసూళ్లు అనూహ్యంగా డ్రాప్ అవుతాయి. కొద్దోగొప్పో కలెక్షన్లతోనే ఆ చిత్రం నెట్టుకువస్తుంది. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువయ్యింది కూడా. కానీ.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మాత్రం ఆ సూత్రాన్ని నామరూపాలు లేకుండా చెరిపేసింది. రెండు వారాల్లో బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. 15, 16 రోజులలో ఈ చిత్రం వసూళ్లు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.67 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండో రోజుల్లో రూ. 3.39 కోట్లు (షేర్) కొల్లగొట్టింది. ఓవైపు ‘శాతకర్ణి, శతమానం భవతి’ సినిమాలు.. మరోవైపు ‘రయీస్, కాబిల్’ చిత్రాలు.. ఆ నాలుగు పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అంత భారీ పోటీలోనూ ఖైదీ చిత్రం రెండురోజుల్లో అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా చెప్పుకోదగిన విషయమే. దీంతో.. మొత్తం 16 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 98.06 కోట్లు సాధించిందన్నమాట. పదేళ్లు గ్యాప్ ఇచ్చినా.. చిరు స్టామినా ఏమాత్రం తగ్గిపోలేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి.

ఏరియాల వారీగా 16 రోజుల కలెక్షన్ల వివరాలు :
నైజాం : 18.60
సీడెడ్ : 14.04
నెల్లూరు : 3.15
గుంటూరు : 6.76
కృష్ణా : 5.32
వెస్ట్ గోదావరి : 5.72
ఈస్ట్ గోదావరి : 7.65
ఉత్తరాంధ్ర : 11.98
ఏపీ+తెలంగాణ : రూ. 73.22 కోట్లు
ఓవర్సీస్ : 13.94
కర్ణాటక : 9
రెస్టాఫ్ ఇండియా : 1.90
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 98.06 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news