Moviesసైరా సెట్టింగ్స్ న భూతో న భవిష్యత్..!

సైరా సెట్టింగ్స్ న భూతో న భవిష్యత్..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ మోషన్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచేసింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా సినిమాకు సంబందించిన సెట్స్ గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేశారు.

సైరా కోసం సెట్టింగ్స్ అద్భుతంగా వేస్తున్నారని.. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి సెట్స్ వేయలేదని అంటున్నారు. సినిమా నిర్మాణంలో సగానికి పైగా ఖర్చు ఈ సెట్స్ వేసేందుకే అవుతుందని అన్నారు. హైదరాబాద్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఈ సెట్స్ వేస్తున్నారట. కచ్చితంగా ఈ సెట్స్ చూశాక న భూతో న భవిష్యత్ అనేలా ఉంటాయని అన్నారు.

చిరంజీవి పక్కన నయనతార హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఇద్దరు భామలకు ఛాన్స్ ఉందని అంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఎలంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news