Gossipsచెర్రీ -తారక్ మల్టీస్టార్ సినిమాకి టైటిల్స్ ఇవేనా...?

చెర్రీ -తారక్ మల్టీస్టార్ సినిమాకి టైటిల్స్ ఇవేనా…?

దర్శక బాహుబలి జక్కన్న ఆధ్వర్యంలో రాబోతున్న చెర్రీ , తారక్ మల్టీస్టార్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి అభిమానులకు. ఎందుకంటే వీరిద్దరికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు కదా ! అందులోనూ అపజయమే ఎరుగని దర్శక ధీర రాజమౌళి ఆధ్వర్యంలో రాబోతుంది అందుకే ఇంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా మీద.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి ఫోటోలో కనిపించాడో అప్పటి నుంచి అభిమానులు ఏది నిజమో, ఏది అబద్దమో అనే విషయం తెలియకుండా ఇప్పటివరకు అనేక పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపు 170 నుంచి 180కోట్ల వరకు ఉండొచ్చు అని ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారట. అలాగే ఇద్దరు ప్రొఫెషనల్ బొక్సర్స్ గా నటిస్తున్నారని ఫిలిం నగర్ లో ఒకటే పుకార్లు.

అయితే ఈ సినిమా మీద ఎన్ని పుకార్లు వచ్చినా రాజమౌళి మాత్రం దీని మీద స్పందించడమే లేదు. అన్నట్టు మళ్ళీ ఈ సినిమా గురించి తాజాగా కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకి సంభందించి రెండు టైటిల్స్ కూడా సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతున్నాయి.

బాక్సర్ అని టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి టీం ఉందని, అలాగే యమధీర అనే టైటిల్ కూడా పెట్టాలని ఫ్యాన్స్ నుంచి వత్తిడి వస్తున్నట్టు ఆ వార్తల సారాంశం. అయితే రాజమౌళి మాత్రం ఎన్ని పుకార్లు వచ్చినా నోరు మాత్రం విప్పడంలేదు ఈ సినిమా గురించి. అయితే చాలా ఆతృతగా ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఆగుతారా ఏంటి రోజుకొక పుకారు పుట్టిస్తూనే ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news