Gossipsఫ్లాప్ డైరెక్టర్ చేతిలో బయోపిక్ ...!

ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో బయోపిక్ …!

బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి తేజ క్విట్ అయిన సంగతి తెలిసిందే. క్రిష్, రాఘవేంద్ర రావుల పేర్లు వినపడ్డా ఫైనల్ గా బాలయ్య బాబే తన సినిమాను డైరెక్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యాడట. అయితే హీరోగా దర్శకుడిగా రెండిటిని హ్యాండిల్ చేయడం కష్టమని దర్శకత్వంలో అనుభవమున్న డైరక్టర్స్ కోసం వెతుకుతున్నారట.

ఇక ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఆనలుగురు లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన చంద్ర సిద్ధార్థ్ ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయబోతున్నాడని అంటున్నారు. మధుమాసం, అప్పుడప్పుడు, అందరి బందువయా, ఏమో గుర్రం ఎగురావచ్చు సినిమాలు తీసిన చంద్ర సిద్ధార్థ్ టాలెంట్ ఉన్నా సరే వెనకపడ్డాడు.

ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి అతని పేరు వార్తల్లో నిలిచింది. అయితే పేరుకే చంద్ర సిద్ధార్థ్ అని తెరవెనుక బాలకృష్ణ అంతా నడిపించాలని చూస్తున్నారని అంటున్నారు. మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ కు ఫైనల్ డైరక్టర్ ఎవరన్నది మాత్రం మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news