Gossipsమా వల్ల కాదంటూ చేతులెత్తిసిన తారక్ - చరణ్

మా వల్ల కాదంటూ చేతులెత్తిసిన తారక్ – చరణ్

దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాగా మెగా నందమూరి మల్టీస్టారర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనబడితే ఇక రికార్డుల లెక్క ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసిన తారక్ సినిమా కథగా ఓ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కథ ఎంచుకున్నాడని తెలుస్తుంది. అయితే దీని కోసం చరణ్, ఎన్.టి.ఆర్ హోం వర్క్ చేయాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం రాం చరణ్ రంగస్థలం సెట్స్ లో ఉన్నాడు. అది పూర్తవ్వకముందే బోయపాటితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక జై లవ కుశ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తారక్ ప్రస్తుతం త్రివిక్రం తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. అది కూడా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలు రెండు పూర్తయితేనే కాని రాజమౌళి సినిమా మొదలు పెట్టే అవకాశం ఉండదు.

కాని రాజమౌళి మాత్రం అక్టోబర్ 10న సినిమా మొదలు పెట్టాల్సిందే అంటున్నాడట. అందుకే చరణ్ బోయపాటి శ్రీనుతో.. తారక్ త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమాలు క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కాని చరణ్, ఎన్.టి.ఆర్ లు బోయపాటి సినిమా కోసం మరో దర్శకుల సినిమాలు త్యాగం చేస్తున్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news