Moviesచరణ్ తో ఆది ఫైట్.. అన్నదమ్ముల కథే రంగస్థలం..!

చరణ్ తో ఆది ఫైట్.. అన్నదమ్ముల కథే రంగస్థలం..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రేజీ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడట. అంతేకాదు సినిమాలో చరణ్, ఆది అన్నదమ్ములుగా నటిస్తారని తెలుస్తుంది. అన్న మంచితనంతో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే ఆది మాత్రం ఈర్ష్య పెంచుకుని అన్న మీద పగ సాధిస్తాడట.
పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని తెలుస్తుంది. హీరోగా సక్సెస్ అవని ఆది పినిశెట్టి విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు. సరైనోడుతో అల్లు అరున్ కు విలన్ గా నటించి హిట్ అందుకున్న ఆది. ఆ తర్వాత నిన్ను కోరిలో సపొర్టింగ్ రోల్ చేశాడు. ఇక రంగస్థలంతో పాటుగా పవన్ అజ్ఞాతవాసిలో కూడా యాంటీ హీరో రోల్ చేశాడు.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మార్చి 16న రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news