Moviesఎన్టీఆర్ అన్న అమ్మాయి వేషంలో అదరగొట్టేశాడు.. సోషల్ మిడియాలో వైరల్ గా...

ఎన్టీఆర్ అన్న అమ్మాయి వేషంలో అదరగొట్టేశాడు.. సోషల్ మిడియాలో వైరల్ గా మారిన వీడియో ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో విలన్ గా నటించిన ఉన్ని ముకుందన్ గుర్తుండే ఉంటాడు. ఈమధ్యనే వచ్చిన భాగమతి సినిమాలో కూడా పవర్ ఫుల్ రోల్ చేసి మెప్పించాడు. మలయాళంలో అతను మంచి నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. అందుకే ప్రస్తుతం తను నటిస్తున్న చాణక్య తంత్రం సినిమాలో లేడీ గెటప్ లో కనిపిస్తున్నాడు.

కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా మేకింగ్ వీడియోలో ఉన్ని ముకుంద లేడీ రోల్ కరిష్మా లుక్ లో అదరగొట్టాడు. జనతా గ్యారేజ్ లో విలన్ గా చేసినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉన్ని ముకుందన్ ఇప్పుడు తను లీడ్ రోల్ గా చేస్తున్న సినిమాతో ఇంప్రెస్ చేస్తున్నాడు. మేకింగ్ వీడియోలో ఉన్ని ముకుందన్ గెటప్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ గెటప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇలా వీడియో రిలీజ్ అయ్యిందో లేదో ట్రెండింగ్ లో ఉంది అంటే ఇక ఉన్ని ముకుందన్ లేడీ గెటప్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి వేషమైనా వేసేందుకు వెనుకాడడని ఉన్ని ముకుందన్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news