Gossipsఛలో బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఛలో బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛలో. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కథ ఏంటో టీజర్, ట్రైలర్ లో చెప్పేశారు. డైరక్టర్ చెప్పిన కథ నచ్చి ఓన్ ప్రొడక్షన్ లో రిస్క్ చేసిన నాగ శౌర్య ఈ సినిమా ఎంత బిజినెస్ చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సినిమా బడ్జెట్ 6 కోట్లు.. ప్రమోషన్స్ కు 3 కోట్లు కాగా ఏకంగా 10 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. తెలుగు రెండు రాష్ట్రాల్లో 8 కోట్ల బిజినెస్ చేయగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓ కోటి, ఓవర్సీస్ లో మరో కోటి బిజినెస్ అయ్యిందట. మొత్తంగా ఈ సినిమా 10 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా హిట్ బ్రేక్ ఈవెన్ గా 11 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది. సినిమాపై పాజిటివ్ బజ్ బాగానే ఉండగా హిట్ టాక్ వస్తే ఈ మాత్రం కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. మరి నాగ శౌర్య ఛలో ఏమేరకు సత్తా చాటుతాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news