Newsకన్నుకొట్టిన పాపపై కేసు.. హైదరాబాద్‌లో గరంగరం!

కన్నుకొట్టిన పాపపై కేసు.. హైదరాబాద్‌లో గరంగరం!

ప్రియా ప్రకాష్ వారియర్.. గత మూడురోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసిన ఈ మలయాళీ అమ్మాయే కనిపిస్తోంది. తన లేటెస్ట్ మూవీ ‘ఓరు అదార్ లవ్’ మూవీకి సంబంధించి విడుదలైన పాటలో అమ్మడు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కన్నుకొట్టడంతో.. దేశవ్యాప్తంగా యువత మొత్తం ఫిదా అయిపోయారు. ఇలా అందరినీ తన మైకంలో పడేసిన ప్రియా.. ఇప్పుడు తనే చిక్కుల్లో చిక్కుకుంది.

ఆ పాటపై హైదరాబాద్‌కి చెందిన కొందరు ముస్లింలు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఆ పాటలోని లిరిక్స్ అభ్యంతరకరంగా వున్నాయని.. వాటిని తొలగించాల్సిందిగా కోరుతూ వాళ్ళు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే.. ప్రియాతో తమకు ఎలాంటి ఇబ్బందిలేదని, కేవలం పాటలోని లిరిక్స్ మాత్రమే అభ్యంతరకంగా వున్నాయంటూ వాళ్ళు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news