Newsఅశ్లీల చిత్రాలు చూస్తూ బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. తర్వాత...

అశ్లీల చిత్రాలు చూస్తూ బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. తర్వాత ఏమైందో తెలుసా ??

టీఎస్ ఆర్టీసీ మినీ వజ్ర బస్సు డ్రైవర్ అశ్లీల చిత్రాలు చూస్తూ వాహనం నడిపాడంటూ సంబంధిత అధికారులకు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. వరంగల్-2 డిపోకు చెందిన టీఎస్ 03 జెడ్ 0340 నెంబర్ గల వజ్ర బస్సు సర్వీసు నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లికి వస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు జనగామ డిపోలో నాగలింగం అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు. వరంగల్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో సదరు ప్రయాణికుడు ఇందులో ప్రయాణిస్తున్నాడు.

బస్సు స్టేషన్ ఘన్ పూర్ దాటగానే కుదుపునకు లోనైంది. ఈ క్రమంలో నావిగేషన్ నిమిత్తం బస్సు డ్రైవర్ ఉపయోగిస్తున్న ట్యాబ్ లో నీలి చిత్రాలు చూస్తున్నట్టు నాగలింగం గమనించారు. వెంటనే, బస్సును ఆపించి, ఈ విషయమై డ్రైవర్ ని నిలదీయగా బుకాయించాడు. ఈ క్రమంలో ప్రయాణికులంతా కలసి బస్సును జనగామ డిపోకు తీసుకువెళ్లి, అధికారులకు ఫిర్యాదు చేశారు. ట్యాబ్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడనేందుకు ఆధారాలు దొరకడంతో డ్రైవర్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయమై సదరు ప్రయాణికుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news