Gossipsట్రెండ్ మార్చిన బన్నీ... అన్ని కొత్తగానే..

ట్రెండ్ మార్చిన బన్నీ… అన్ని కొత్తగానే..

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ … ఈ హీరో యాక్షన్ , డాన్స్, అన్ని డిఫ్రెంట్ గా స్టయిల్ గా ఉంటాయి మంచి ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన ఈ స్టైలిష్ స్టార్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ . సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫ్యాన్స్ కలిగి ఉన్న బన్నీ సినిమా కోసం ఎప్పుడూ ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ ఎదురు చూపులు చూస్తుంటారు. అంతగా పేరు సంపాదించేసాడు ఈ అల్లు వారి అబ్బాయి.

బన్నీ ఏది చేసినా స్పెషలే అనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. హీరోలంతా సినిమాలు చెయ్యాలంటే .. పెద్ద పెద్ద డైరెక్టర్లే కావాలంటూ పట్టుపట్టి కూర్చుంటారు. అయితే బన్నీ మాత్రం ఆ సంప్రదాయాలను ఎప్పుడూ పాటించాడు. కథ నచ్చితే చాలు కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తాడు. ఈ కోవలోనే.. రైటర్ గా అనుభవం వున్న వక్కంతం వంశీకి కూడా అవకాశం ఇచ్చాడు.. దాంతో ఆయన దిరెచ్తిఒన్ లో నా పేరు సూర్య సినిమా సిద్ధమవుతోంది.

ఇంతటితో ఆగాడా అంటే అదీ లేదు. మళ్ళీ మరో కొత్త దర్శకుడు చెప్పిన కథ వినేసాడు అది బాగా నచ్చేయ్యడంతో దాన్ని ఒకే చేసేసాడు. సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు బన్నీకి కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కదా కూడా నచ్చేయ్యడంతో ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు కూడా ఒప్పేసుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్.

నా పేరు సూర్య కాస్త ఎమోషనల్ సినిమా కావడంతో .. ఆ సినిమా తరువాత ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు. ఆ తరువాత ఈ సంతోష్ రెడ్డి సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ సినిమాలో బాక్సింగ్ నేపథ్యం చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఏమైనా బన్నీ స్టయిలే వేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news