Newsటీవీ నటిపై అత్యాచారయత్నం.. బడాబాబు దెబ్బకు కేసులో కొత్త ట్విస్ట్

టీవీ నటిపై అత్యాచారయత్నం.. బడాబాబు దెబ్బకు కేసులో కొత్త ట్విస్ట్

A builder son Darshan rape attempt on Kannada TV actress in sky bar. But later she gave an unbelievable response on this issue which shocks everyone. Read below article to know full details.

బాగా డబ్బున్న బడాబాబుల కొడుకులు ఈమధ్య తెగ రెచ్చిపోతున్నారు. ఏం చేసినా తమ పలుకుబడితో ఇతరుల నోరు మూయించొచ్చన్న అహంకారంతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ముఖ్యంగా.. అమ్మాయిలపై కీచకుల్లాగా ఎగబడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పటికే పీకల్లోతు తాగి మద్యం మత్తులో ఓ మృగాడు.. టీవీ నటిని చూసి తట్టుకోలేక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనలో అనుకోని ట్విస్ట్ కూడా ఉంది. అదేంటో తెలియాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని స్కై బార్‌లో ఓ బిల్డర్ కొడుకైన దర్శన్ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఓ టీవీ నటి కూడా తన ఫ్రెండ్స్‌తో ఆ బార్‌లోకి వచ్చింది. అప్పటికే పీకలదాకా మద్యం తాగి వున్న దర్శన్.. ఆ టీవీ నటిని చూసి ఆగలేకపోయాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి కౌగలించుకున్నాడు.. అనంతరం గట్టిగా ముద్దులు పెట్టడంతోపాటు కొరికాడు కూడా. దాంతో ఆ నటి కేకలు వేయగా.. ఆమె ఫ్రెండ్స్ దర్శన్‌పై దాడి చేశారు. ‘నన్నే కొడతారా’ అంటూ దర్శన్ తన స్నేహితుల్ని పిలిపించుకుని.. టీవీ నటి బృందంపై దాడి చేయించాడు. దీంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర గొడవ నెలకొంది. ఇంకేముంది.. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.

అయితే.. దర్శన్ తండ్రి బాగా పలుకుబడి ఉన్నవాడు కావడంతో అతడు చక్రం తిప్పాడు. ఆ టీవీ నటికి డబ్బులిచ్చి ఆశ చూపాడో లేక వార్నింగ్ ఇచ్చాడో తెలీదు కానీ.. ఆమె మీడియా ముందుకొచ్చి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చింది. తనపై అసలు అత్యాచారమే చేయలేదని, దర్శన్ తనని ఇబ్బంది పెట్టలేదని, ఏదో చిన్న కారణం వల్ల గొడవ మాత్రమే జరిగిందని, తాము ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయట్లేదని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news