Newsకొత్త పెళ్ళికూతుర్ని నట్టేట ముంచిన సెకండ్ హ్యాండ్ మొగుడు.. లబోదిబోమంటున్న పేరెంట్స్

కొత్త పెళ్ళికూతుర్ని నట్టేట ముంచిన సెకండ్ హ్యాండ్ మొగుడు.. లబోదిబోమంటున్న పేరెంట్స్

A bridegroom who is a government has escaped before one day of marriage from function hall in chittor. Bride filed a case against him for cheating.

అతడో గవర్నమెంట్ టీచర్.. ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అయితే అనారోగ్యం కారణంగా భార్య మృతి చెందడంతో.. మరో పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ తండ్రి అతగాడికి తన కూతురినిచ్చి పెళ్ళి చేయాలని ముందుకొచ్చాడు. ప్రభుత్వుద్యోగి కావడంతో.. అతనితో తన కూతురి భవిష్యత్తు బాగుంటుందని ఆ తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఈ పెళ్ళికి అంగీకరించడంతో చకచకా అన్ని కార్యక్రమాలు కానిచ్చేశారు. ఇక రేపే పెళ్ళి అనగా.. ఆ ఉపాధ్యాయుడు ముందురోజు రాత్రే పారిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా, పీటీఎం మండలంలోని ఉప్పరవాండ్లపల్లెకు చెందిన గంగాధర్‌ మండల కేంద్రం సమీపంలోని తాకాటంవారిపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు. ఇటీవల అతడి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో.. మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కడప జిల్లా రాయచోటీకి చెందిన బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిని స్వరూపారాణితో ఈ నెల 23న వివాహం నిశ్చయమైంది. వీరి పెళ్ళి బి.కొత్తకోటలోని శివాలయంలో చేయాలని నిర్ణయించారు. 22వ తేదీ రాత్రి వధువు, ఆమె తరపున బంధువులు అందరూ పెళ్ళి వేదికకు చేరుకున్నారు. ఇక తెల్లారితే పెళ్ళి కావడంతో.. అందరూ ఆ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పెళ్ళికూతురిని రెడీ చేయడం, ఇతర పనులు చూసుకోవడంలో వధువు తరఫు వారు ఫుల్ బిజీ అయిపోయారు.

ఇలా వాళ్లంతా తమతమ పనుల్లో బిజీ కావడంతో.. ఇదే అదును అనుకుని గంగాధర్ తన పిల్లలతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకుని ఇరు కుటుంబాలు ఖంగుతిన్నారు. అతడు ఎక్కడికి వెళ్ళాడోనని ఆరాతీయగా.. గంగాధరే స్వయంగా ఫోన్ చేసి, ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి, స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో.. తీవ్ర ఆగ్రహం చెందిన బాధిత యువతి కుటుంబసభ్యులు గంగాధర్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news