Gossipsఏంటి ..? మళ్ళీ బ్రమ్మోత్సవం సినిమా వస్తోందా ..?

ఏంటి ..? మళ్ళీ బ్రమ్మోత్సవం సినిమా వస్తోందా ..?

అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ప్రిన్స్ నటించిన బ్రమ్మోత్సవం సినిమా సౌత్ లోనే అతిపెద్ద రెండో డిజాస్టర్ గా పేరుతెచ్చుకుంది. అటువంటి సినిమాను తమిళ ప్రజలకు చూపించేందుకు సిద్దమైపోతున్నాడు మహేష్. ఇప్పటికే స్పైడర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి మహేష్ పేరు కాస్తా దెబ్బతింది. ఈ టైం లో మళ్ళీ బ్రమ్మోత్సవం లాంటి భారీ ప్లాప్ సినిమా తమిళంలో రిలీజ్ చేసేందుకు సిద్దమయిపోతున్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మహేష్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. అసలే వరుస ప్లాప్ లతో ఉన్న మా హీరోకి తమిళంలో ప్లాప్ సినిమా తీసుకెళ్లి పేరు పోగొడతారా..? అంటూ ఆగ్రహం చెందుతున్నారు.

అయినా ఇవేమి పట్టించుకోకుండా ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో విడుదల చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ‘స్పైడర్’తో కోలీవుడ్‌కి అధికారికంగా పరిచయమైన మహేష్ బాబు క్రేజ్‌ని వాడుకునేందుకు అక్కడి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మొదట వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎంత మంచి హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

దీంతో వీరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఎన్నో అంచనాలతో తెర మీదకు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక అంతే అపకీర్తిని మూటగట్టుకుంది.

ఈ సినిమాతో మహేష్ పరువు పోవడమే కాకుండా ఆయన కెరీర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది.అంతే కాకుండా ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. కానీ తమిళ సినిమా ఇండ్రస్ట్రీ కొంచెం డిఫ్రెంట్. ఇక్కడ ఫెయిల్ అయినవి అక్కడ హిట్, అక్కడ హిట్ అయినవి ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ లాజిక్ నే ఫాలౌ అయ్యేందుకు నిర్మాతలు నిశ్చయించుకున్నారు.

2016లో విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమాని తాజాగా ఇప్పుడు కోలీవుడ్‌లో ‘అనిరుధ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా అక్కడ విడుదల చేసినందుకు సిద్ధమవుతున్నారు. అందీ కాకుండా ఈ సినిమాలో కాజల్, సమంత లాంటి భామలు ఉండడం, వారికి తమిళ్ మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకి అది ప్లస్ పాయింట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news