Moviesవామ్మో బోయపాటి నువ్ మాములోడివి కాదు.. జయ జానకి నాయకా టీజర్...

వామ్మో బోయపాటి నువ్ మాములోడివి కాదు.. జయ జానకి నాయకా టీజర్ చూస్తే మైండ్ బ్లాంక్..!

స్టార్ హీరోలతో సూపర్ హిట్ కొట్టడం దర్శకులకు ఈజీ కావొచ్చు కాని కొత్త హీరోతో ప్రయోగం చేయాలంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ టన్నుల కొద్ది ఉన్నాయంటున్నాడు డైరక్టర్ బోయపాటి శ్రీను. తన డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా జయ జానకి నాయకా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

ఇప్పటిదాకా తనలోని మాస్ యాంగిల్ చూపించిన బోయపాటి ఈసారి కొత్తగా తనలోని క్లాస్ అండ్ రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించేందుకు రెడీ అయ్యాడు. జయ జానకి నాయకా టైటిల్ తోనే షాక్ ఇచ్చిన బోయపాటి సినిమా టీజర్ తో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. ఓ మంచి వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ తో టీజర్ కట్ చేయగా కేవలం ఎమోషన్స్ ను మాత్రమే నడిపించాడు.

టీజర్ తోనే కథ చెప్పేస్తే ఎలా అనుకున్నాడో ఏమో కాని బోయపాటి వేసిన ఈ మెగా ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. జయ జానకి నాయకా టీజర్ బోయపాటిలోని కొత్త యాంగిల్ ను చూపిస్తుంది. ఎప్పుడు రక్తపాతాలతో టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసే ఈ యాక్షన్ డైరక్టర్ కొత్త టర్న్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న జయ జానకి నాయకా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకు పోటీగా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news