Gossipsబోయపాటి శ్రీనుకి చుక్కలు చూపిస్తున్న చరణ్..!

బోయపాటి శ్రీనుకి చుక్కలు చూపిస్తున్న చరణ్..!

రంగస్థలం సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేసుకున్న చరణ్ ఆ సినిమా మొదటి షెడ్యూల్ లోనే బోయపాటికి చుక్కలు చూపించాడని ఫిల్మ్ నగర్ టాక్. సినిమా మొదటి షెడ్యూల్ హీరో లేకుండానే పూర్తి చేశాడట. అయితే సెకండ్ షెడ్యూల్ కు సంబందించి చరణ్ డేట్స్ విషయంలో క్లాషెస్ వస్తున్నాయట. రంగస్థలం పూర్తయ్యే దాకా బోయపాటి శ్రీను సినిమా చేయడం కష్టం.

అయితే ఈ విషయం వల్ల బోయపాటికి చరణ్ చుక్కలు చూపిస్తున్నాడని టాక్. మాస్ అండ్ కమర్షియల్ సినిమాలను తీసే బోయపాటికి చరణ్ తలనొప్పిగా మారాడట. ఈ కాంబోలో మొదటి సినిమానే అయినా షెడ్యూల్ విషయంలో ఇద్దరిది చెరో దారి అయ్యిందట. అయితే ఈ మ్యాటర్ చిరు దాకా వెళ్లడంతో ఇద్దరికి సర్ధి చెప్పినట్టు టాక్.

రంగస్థలం షెడ్యూల్ పూర్తి చేశాక ఇక ఫుల్ టైం బోయపాటి సినిమాకే కేటాయిస్తాడట చరణ్. మార్చి 30న రంగస్థలం రిలీజ్ అంటే మరో వారం పదిరోజుల్లో ఆ సినిమా పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి నుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news