Newsపిల్లలు పుట్టడం లేదని....? వాళ్ళు ఆ పూజ చేశారు...!

పిల్లలు పుట్టడం లేదని….? వాళ్ళు ఆ పూజ చేశారు…!

పిల్లలు కలగడం లేదనే కారణంతో నగ్నంగా పూజలు చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో సంతానం కోసం.. కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పూజలను అడ్డుకొని ఇద్దరు మంత్రగాళ్లను, అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన కొంత మంది మహిళలు గర్భం దాల్చకపోవడంతో.. పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించారు. సంతానం కోసం ఆమె క్షుద్రపూజలు చేయాలని చెప్పి, మంత్రగాళ్ల దగ్గరికి తీసుకెళ్లింది.ఎస్సారెస్పీ కాలువ వద్ద కొంత మంది మహిళలను నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తుండగా.. స్థానికులు గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ సిబ్బందితో పాటు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో తరచూ ఇలాంటి పూజలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మంత్రాలు చేస్తున్న వారిలో ఓ పురుషుడు కూడా ఉన్నారు. మరోవైపు బాధితురాళ్లలో ఓ యువతి భర్త జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్టు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news