Gossipsపెద్ద చేపలు బయటకి రాబోతున్నాయి.. డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీ పెద్దలు..ఆ ...

పెద్ద చేపలు బయటకి రాబోతున్నాయి.. డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీ పెద్దలు..ఆ రెండు కుటుంబాలు..

మూడవ రోజు సుబ్బరాజుని ప్రశ్నించిన సిట్ అధికారులు, ఈ విచారణ ద్వారా మరికొందరు నటుల పేర్లు రాబట్టినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. టాలీవుడ్ లో దశాబ్ద కాలాల పాటు సంబంధం కలిగిన రెండు కుటుంబాలు ఇందులో ఉన్నట్లుగా అవుతున్న కధనాలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ రెండు కుటుంబాలు ఎవరు? అలాగే తెరపైకి రానున్న మరికొందరు సినీ ప్రముఖులు ఎవరు? అన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

ముఖ్యంగా రెండు కుటుంబాల విషయానికి వస్తే… ఇటీవల దగ్గుపాటి సురేష్ మరియు అల్లు అరవింద్ ల పుత్రరత్నాలు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను మీడియా వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణలో వెలుగుచూసిన రెండు కుటుంబాల పేర్లు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ నెల 24వ తేదీన విచారణను ఎదుర్కొననున్న నటుడు నవదీప్ పబ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరిగేవన్న విషయం కూడా ఈ విచారణలో వెలుగుచూసినట్లుగా మీడియా ఛానల్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news