Specialsబిగ్ బాస్ సాక్షిగా ప్రిన్స్...దీక్షా ...ముద్దుల రొమాన్స్ పిచ్చెక్కిస్తోంది...

బిగ్ బాస్ సాక్షిగా ప్రిన్స్…దీక్షా …ముద్దుల రొమాన్స్ పిచ్చెక్కిస్తోంది…

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు కాస్త కలర్ ఫుల్ గా మారిందని చెప్పొచ్చు. 14 మంది హౌజ్ మెట్స్ లో జ్యోతి, సంపూర్నేష్, మధుప్రియలు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చారు. ఈ క్రమంలో 11 బాలేదని హాట్ బ్యూటీ దీక్షా సేథ్ ను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించాడు తారక్. మొదట వెళ్లిన వారి కన్నా ఈమె నడిచిన ఎపిసోడ్స్ చూసి వెళ్లింది కాబట్టి ఆచి తూచి గేమ్ ను ఆడుతుంది. అదే విషయాన్ని మిగిలిన హౌజ్ మెట్స్ కూడా గుర్తించారు.

ఇక మరో పక్క దీక్ష రాకతో హౌజ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రిన్స్ కు మంచి హుశారొచ్చింది. ప్రస్తుతం ఈవారం కెప్టెన్ గా ఉన్న ప్రిన్స్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోగా కొత్తగా వచ్చిన దీక్షకు రొమాంటిక్ యాంగిల్ ట్రై చేస్తున్నాడు. నిన్న ఎపిసోడ్ లో అయితే దీక్షాకు సారీ చెప్పే క్రమంలో ప్రిన్స్ ఆమెకు ముద్దు కూడా పెట్టాడు. దీక్షా, ప్రిన్స్ ల ముద్దు వ్యవహారం బిగ్ బాస్ లో హౌజ్ లో కొత్త ఉత్సాహం తెచ్చింది. అసలు సిసలైన షో ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడ అభిప్రాయాలు కలవడం గగనం అనుకుంటున్న సమయంలో ప్రిన్స్ కొత్తగా వచ్చిన దీక్షతో ముద్దులాట ఆడటం అందరిని అవాక్కయ్యేలా చేసింది. మరి వీరిద్దరు రాబోయే రోజుల్లో ఎలా ఉంటారో చూడాలి.

prince

PCTV-1000184833-hsm

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news