Newsబిగ్ బాస్ 100 సీజన్స్ నువ్వే చేయాలన్నా.. కార్తిక కోరికకు షాక్...

బిగ్ బాస్ 100 సీజన్స్ నువ్వే చేయాలన్నా.. కార్తిక కోరికకు షాక్ అయిన ఎన్టీఆర్..!(వీడియో)

శని ఆదివారాలు వస్తున్నాయి అంటే బిగ్ బాస్ తారక్ వస్తాడని ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూడటమే సరిపోతుంది. బిగ్ బాస్ హోస్ట్ గా తారక్ అన్నివిధాలుగా పర్ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ధన్ రాజ్ ఎలిమినేట్ ఎనౌన్స్ చేసిన తారక్ స్టేజ్ మీదకు తనని పిలిచి తన జర్నీని చూపించి నవ్వించి కవ్వించేలా చేశాడు. అంతేకాదు ధన్ రాజ్ కు కొడుకు పుట్టాడు అన్న విషయాన్ని తన భార్య ద్వారా ఎనౌన్స్ చేయించి ఆశ్చర్యపరచాడు.

ఇక ఈరోజు అర్చన, కార్తికలలో కార్తికను ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ హౌజ్ కు ఆమె పనికిరాదు అన్నది ఆడియెన్స్ ఫీలింగ్ కాబోలు. ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కార్తిక కూడా తారక్ దగ్గరకు వచ్చి హౌజ్ మెట్స్ ఒక్కొక్కరి గురించి వారి ఫోటోల కింద స్కెచ్ వేస్తూ చూపించింది. ఇక కార్తికతో పాటు ఎన్.టి.ఆర్ కూడా తెలంగాణా యాసలో మాట్లాడటం బాగుంది.

వెళ్తూ వెళ్తూ తారక్ తో కార్తికా అన్నా నీ యాంకరింగ్ సూపర్.. బిగ్ బాస్ తెలుగు ఇంకో 100 సీజన్స్ చేసినా అన్నిటికి నువ్వే యాంకర్ గా చేయాలని అన్నది. ఓ స్టార్ గా ఉన్నా సరే తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా తనని తాను మలచుకున్న తీరు కార్తిక నోట మాటే కాదు తెలుగు ప్రేక్షకులందరు అదే మాట అనాల్సిందే. అందుకే కాబోలు బిగ్ బాస్ సీజన్-2 కి తారక్ నే హోస్ట్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది. కానీ అందరూ గమనించనిది ఏమిటంటే..? కొన్నిసార్లు సందర్భం వచ్చినప్పుడు తారక్ మాట్లాడుతున్న తెలంగాణ యాస… పర్ఫెక్ట్ యాస… ఏమాత్రం కృత్రిమంగా లేదు… సహజంగా ఓ హైదరాబాదీ ఎలా మాట్లాడతాడో అలా అన్న మాట… ఎక్స్ లెంట్ ఎన్టీఆర్…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news