Newsబిగ్ బాస్ ఎన్టీఆర్.. టి.ఆర్.పి తుక్కురేగ్గొట్టాడు..!

బిగ్ బాస్ ఎన్టీఆర్.. టి.ఆర్.పి తుక్కురేగ్గొట్టాడు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బుల్లితెర మీద మొదటిసారి ప్రత్యక్షమై చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ షోని తారక్ తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ రక్తికట్టిస్తున్నారు. 14మంది కంటెస్టంట్స్ ఉన్నా శని ఆదివారాలు వచ్చే తారక్ ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు అంటే ఈ షోతో తారక్ మరోసారి తన సత్తా చాటాడని చెప్పొచ్చు.

ఇక వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ షో టి.ఆర్.పి రేటింగ్స్ కూడా తుక్కురేగ్గొట్టేస్తుంది. ముఖ్యంగా ఈరోజు వచ్చిన బుల్లితెర టి.ఆర్.పి రేటింగ్ లో బిగ్ బాస్ అత్యధికంగా 16.18 రేటింగ్ సంపాదించింది. ఇది ఎన్.టి.ఆర్ చేస్తున్న శని ఆదివారాలకే వచ్చే రెస్పాన్స్ అన్నమాట. మిగతా వారం ఎలా ఉన్నా తారక్ వస్తున్నాడు అంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు బుల్లితెర ఆడియెన్స్ కూడా టివిలకు అతుక్కుపోతున్నారంటే నమ్మాలి.

Highest TRP rating for hosts

NTR 16.18
Nag 12.34
Rana 9.1
Anasuya 4.11
Chiru 3.62

కేవలం నటన మాత్రమే కాదు తన తెలివిని కూడా వాడుతూ ప్రోగ్రాం నడిపిస్తున్న తీరు చూసి అందరు షాక్ అవుతున్నారు. సినిమాలు కేవలం థియేటర్ లోనే కాని.. ఈ రియాలిటీ షో డైరెక్ట్ గా తారక్ ను ఇంటికి తీసుకొచ్చింది. అందుకే బుల్లితెర మీద తారక్ మరో సంచలన రికార్డ్ సాధించాడు. ఈమధ్య కాలంలో స్టార్ మాకు ఈ రేంజ్ లో రేటింగ్స్ రావడం ఇదే మొదటిసారి. 2017లో ఇంత హయ్యెస్ట్ రేటింగ్ రావడం ఇదే ప్రధమం అని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news