Gossipsబిగ్ బాస్ ను ఇక 'ఆ' ముద్దుగుమ్మలే ఆదుకోవాలట..!

బిగ్ బాస్ ను ఇక ‘ఆ’ ముద్దుగుమ్మలే ఆదుకోవాలట..!

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టంట్స్ మీద ప్రేక్షకులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారన్న విషయం తెలిసిందే. హౌజ్ మెట్స్ గా సెలెక్ట్ అయిన వారందరు సెలబ్రిటీస్ కేటగిరికి ఎలా వస్తారు అన్నది ప్రేక్షకుల ప్రశ్న. ఇక మరో పక్క మూడు నాలుగు రోజులవుతున్నా సరే షోలో ఎలాంటి థ్రిల్స్ లేవని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు.

అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ కొంతమందిని హౌజ్ లోకి పంపాలని నిర్ణయించారట. ముఖ్యంగా షోకి గ్లామర్ తెచ్చే విషయంలో అనసూయను ఆ షోకి ప్రిఫర్ చేస్తున్నారు. అసలైతే అనసూయ కూడా ఈ షోలో పాటిస్పేట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించినా 70 రోజులు తన డేట్స్ అంటే కష్టమని లైట్ తీసుకుందట. అయినా సరే అనసూయని బిగ్ బాస్ హౌజ్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇక అనసూయతో పాటుగా తేజశ్వి మడివాడ కూడా ఈ షోలో ఉందని ప్రచారం చేశారు. తేజశ్వి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌజ్ లోకి వెళ్లే అవకాశం ఉందట. ఇదే క్రమంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేర్లలో మంచి లక్ష్మి కూడా ఉందని తెలుస్తుంది. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది బిగ్ బాస్ లో ఉందా.. దాన్ని హౌజ్ మెట్స్ అంగీకరిస్తారా.. ఈ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అన్న విషయాల మీద క్లారిటీ వచ్చే ఎపిసోడ్స్ లో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news