Gossipsబిగ్ బాస్ బ్రేకింగ్ న్యూస్ : షోలో అడుగుపెట్టబోతున్న...

బిగ్ బాస్ బ్రేకింగ్ న్యూస్ : షోలో అడుగుపెట్టబోతున్న అందాల హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ గత 30 రోజులుగా విజయపథంలో నడుస్తుంది.మాములుగా వీక్ డేస్ లో కొంత డల్ గా ఉండే బిగ్ బాస్ హౌస్ లోకి నవదీప్ ఎంటర్ అయిన తర్వాత బాగా రన్ అవుతుంది. అయితే బిగ్ బాస్ అంటేనే హౌస్ ఆఫ్ సర్ ప్రైజెస్ అని ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రతివారం తమ సినిమాలని ప్రమోట్ చేసుకోవాలనుకునే వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు నిర్ణయించారట బిగ్ బాస్ యాజమాన్యం. అలా గత వారం రానా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వారం చొట్టబుగ్గల సోయగం తాప్సి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆగస్ట్ 18న తాప్సి నటించిన ఆనందో బ్రహ్మ విడుదల అవుతున్న సందర్భంలో ఆ సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిగ్ బాస్ హౌజ్ ని తాప్సి సందర్శించనున్నట్లు సమాచారం. అంతే కాదండోయి ఆ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది కాబట్టి అదే తరహాలో షోలో తన ఎంట్రన్స్ మరియు తన బిహేవియర్ కూడా ఉండబోతున్నాయంట. ఇంకేం ఈ వారం బిగ్ బాస్ మరింత అలరించనుందన్న మాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news