Gossipsబిత్తిరి సత్తి హీరో అయిపోయాడు !

బిత్తిరి సత్తి హీరో అయిపోయాడు !

తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన టీవీ కమెడియన్ ఎవరన్నా ఉన్నారంటే అది బిత్తిరి సత్తి నే. వి6 ఛానల్ లో ‘తీన్మార్ వార్తలు’ అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సత్తి…. డిఫరెంట్ గెటప్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వస్తోంది.

తాజాగా తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. బిత్తిరి సత్తి హీరోగా మారిపోయాడు. నిన్నటి దాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ అలరించిన బిత్తిరి సత్తిని సోలో హీరోగా పెట్టి సినిమా షూటింగ్ కూడా మొదలెట్టేసారు. ఇంతకీ సినిమా పేరు ఏంటో తెలుసా ? ‘తుపాకి రాముడు’. సౌండింగ్ బాగుంది కదూ. గతంలో ఆలీ హీరోగా వచ్చిన పిట్టల దొర చాయాల్లో ఉండే పాత్ర చిత్రణతో బిత్తిరి సత్తి పూర్తిగా తెలంగాణా యాసలోనే సందడి చేయనున్నాడట.

దీనికి నిర్మాత టిఆర్ఎస్ ఎమెల్యే రసమయి బాలకిషన్. ఇంటి పేరునే బ్యానర్ గా పెట్టి తీస్తున్నారు. ఈ మధ్యే రామగుండంలో షూటింగ్ స్టార్ట్ చేసారు. తక్కువ టైంలోనే కంప్లీట్ చేసే టార్గెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి మీడియాలో ఎక్కడా పెద్దగా వార్తలు కనిపించడం లేదు.

దర్శక నిర్మాతలు సైతం పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. బిత్తిరి సత్తి డిమాండ్ ఇప్పుడు మామూలుగా లేదు. వి6 ఛానల్ తో ఈ మధ్య విభేదాలు వచ్చాయి అనే వార్తలు కొట్టిపారేస్తు తాను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసాడు. కాకపోతే సినిమాల్లో బిజీ అవుతున్న కారణంగా వారానికి సరిపడా ఎపిసోడ్లు ఒకేసారి షూట్ చేసే పరిస్థితి ఉందట. అయినప్పటికీ సత్తి ఇమేజ్ వేల్యూ తెలిసిన వి6 ఛానల్ ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news