చిరు ఈవెంట్‌కి పవన్ అటెండ్ అవుతాడా? లేదా?.. కోట్లలో బెట్టింగ్‌లు

Betting On Pawan Kalyan For Khaidi No 150 pre release event

There are bets in favor of Pawan Kalyan’s presence for the Khaidi No 150 pre release event as well as against too, stating he is not interested in attending such film events.

మెగా ఈవెంట్లకు పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన సందర్భాలు చాలా అరుదు. ఇతర ఫంక్షన్లకు తనపై చూపించే అభిమానంకొద్దీ పవన్ హాజరవుతున్నాడు కానీ.. మెగా ఫ్యామిలీలో నిర్వహించే ఏ ఈవెంట్లకు పవన్ అటెండ్ అవ్వడం లేదు. దీంతో.. ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనున్న చిరంజీవి మైల్‌స్టోన్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ హాజరవుతాడా? లేదా? అన్నది తారాస్థాయిలో క్యూరియాసిటీ నెలకొంది.

చిరుకి గ్రాండ్ కంబ్యాక్ చెప్పేందుకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలందరితోపాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు సెలబ్రిటీలు కూడా ఈ ఫంక్షన్‌కి హాజరవుతున్నారు. అయితే.. పవన్ వస్తాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అభిమానులందరూ పవన్ హాజరు కావాలని ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. పవన్ వస్తాడని వార్తలు అందుతున్నాయి కానీ.. మరోవైపు హాజరు కాడన్న ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయమై ఏకంగా బెట్టింగ్‌లు కూడా వేసుకుంటున్నారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

చిరు ఈవెంట్‌కి పవన్ అటెండ్ అవుతాడా? లేదా? అన్నదానిపై కోట్లలో బెట్టింగ్‌లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ తతంగం నడుస్తోంది. దీన్ని బట్టి.. మెగాబ్రదర్స్ కలయికపై జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా.. ఇదో ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి, పవన్ తప్పక వస్తాడని అంటున్నారు.

More from my site