బెంగుళూరులో నాలుక కొరికారన్న అమ్మాయి….అసలు కథలో థ్రిల్లర్‌ని మించిన ట్విస్ట్

bangalore-case

సినిమాల ప్రభావం జనాలపైన మామూలుగా లేదు. న్యూ ఇయర్ టైంలో అమ్మాయిలను వేధించారన్న వార్తతో పాటు తన నాలుక కొరికారని చెప్పి ఓ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన న్యూస్ కూడా బాగా హైలైట్ అయ్యింది. నాలుక కొరికారని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన అమ్మాయి కూడా సినిమాలను చూసే….ఆ సినిమాల్లో ఉండే కంటే గొప్ప డ్రామాను జనాలకు చూపించింది. మీడియావళ్ళను కూడా బకరాలను చేసింది. సినిమా ట్విస్ట్‌లను తలదన్నే రేంజ్‌లో ఉన్న ఆ అసలు కథ ఏంటయ్యా అంటే…….

ఈనెల 5వ తేదీన ఉదయం 6.30గంటల సమయంలో గుర్తు తెలియని యువకుడు తనపై దాడి చేసి ముద్దు
పెట్టుకుని నాలుకను గాయపరిచాడని ఓ అమ్మాయి కేజీహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దారిలో షాప్ వద్ద ఉన్న సీసీ కెమేరా దృశ్యాలను చూశారు. ఆ అమ్మాయి మొబైల్ ఫోన్‌కి వచ్చిన కాల్స్ పరిశీలించారు. ఆ అమ్మాయి కూడా సంఘటన గురించి రకరకాలుగా చెప్పడంతో పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకటికి రెండు సార్లు సీసీకెమేరా దృశ్యాలను పరిశీలించారు. వాటిని యువతి కుటుంబ సభ్యులకు చూపించారు. ఆ సిసి కెమేరాలో కనిపించిన యువకుడి కుంటి నడకను చూసిన కుటుంబ సభ్యులు….ఆ కుర్రాడిని ఆ యువతి బావ ఇర్షాద్‌ఖాన్‌గా గుర్తించారు. ఆ సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు కథ బయటకు వచ్చింది.

నిందితుడు ఇర్షాద్‌ఖాన్‌ మరదలే బాధితురాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి అతడి ఇంట్లో మూడేళ్లుగా ఉంటోంది. సొంత బావతోనే ప్రేమలో పడింది. వారి పెళ్లికి తన అక్క అంగీకరించదనే కారణంతో పథకాన్ని రూపొందించారు. మరదలిపై లైంగిక దౌర్జన్యం జరిగిందని ప్రచారం జరిగితే పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారని, అప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చునని ఆశించారు. ముందుగా రూపొందించుకున్న పథకాన్ని 5వ తేదీ ఉదయం 6.30గంటలకు అమలుకు చేశారు. ముసుగు ధరించి ఆ యువతి వెంట పడ్డాడు. ఆ దృశ్యాలు సీసీకెమేరాలో నమోదయ్యేలా చూశాడు. ఆ యువతి చేతిపైన గాయం చేసుకుంది. అలాగే నాలుక కొరుక్కుని గాయం చేసుకుంది. తనపై లైంగిక దౌర్జన్యం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పి….వాళ్ళతోపాటు నిందితుడు ఇర్షాద్‌ఖాన్‌తో కలిసి కేజీహళ్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దాఖలులో జాప్యం చేయడంతో వివిధ సంఘాల ప్రతినిధుల్ని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. దాంతో దేశం మొత్తం కూడా ఆ అమ్మాయి స్టోరీ తెలిసింది. మహిళా హక్కుల సంరక్షకులం అని చెప్పుకునే అందరూ పోలీసులపైన, మగాళ్ళపైనా విరుచుకుపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరికీ దిమ్మతిరిగే అసలు ట్విస్ట్‌ని పోలీసులు కనుక్కున్నారు. ఆ అమ్మాయి చెప్పిన స్టోరీ విని బాధపడిన వాల్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి నాలుకలు వాళ్ళే కరుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటారు?

More from my site