Newsనెంబర్ ప్లేట్ పిచ్చ....సినిమా స్టార్స్, పొలిటీషియన్స్ పిచ్చని బీట్ చేశాడుగా!!

నెంబర్ ప్లేట్ పిచ్చ….సినిమా స్టార్స్, పొలిటీషియన్స్ పిచ్చని బీట్ చేశాడుగా!!

ప్రపంచం మొత్తం కూడా ఇండియన్స్‌కి ఉన్నన్ని సెంటిమెంట్స్ ఇంకెవరికీ ఉండవు. మన దగ్గర చాలా మంది జనాలు సొంత ఇళ్ళు కట్టాలనుకున్నప్పుుడు దాదాపు పదిశాతం అమౌంట్ వాస్తు వ్యవహారాలకే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసీఆర్‌ల సెంటిమెంట్స్ పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? రోజూ న్యూస్ పేపర్స్‌లో చూస్తూనే ఉన్నాంగా. అయితే ఈ పిచ్చతో పాటు కొత్త వాహనం ఏధి కొన్నా కూడా నెంబర్ ప్లేట్ పైన ప్రత్యేకమైన నెంబర్, ఫేవరైట్ నంబర్, అదృష్ట సంఖ్య……ఓవరాల్ ఏదో ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కోసం కోట్లు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

ఈ విషయంలో మన సినిమా స్టార్స్ కూడా తక్కువేం కాదు. అయితే ఈ పొలిటీషియన్స్, సినిమా స్టార్స్ అందరినీ కూడా ఓ టాప్ పిచ్చోడు బీట్ చేసి పడేశాడు. అది కూడా దుబాయ్‌లో ఓ ఇండియనే. తను కావాలనుకున్న నంబర్ కోసం ఏకంగా 60 కోట్లు పెట్టేశాడు. బల్విందర్ సహానీ అనే వ్యాపార వేత్త డి5 అనే నెంబర్ కోసం ఈ మొత్తం చెల్లించి అందరినీ షాక్‌కి గురిచేశాడు.

dubai number plate

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news