Moviesచిరంజీవితో బాక్సాఫీస్ వద్ద పోరుపై బాలయ్య వీరోచిత రెస్పాన్స్

చిరంజీవితో బాక్సాఫీస్ వద్ద పోరుపై బాలయ్య వీరోచిత రెస్పాన్స్

Balayya as usually reponse in heroic style on clash with Chiranjeevi at boxoffice this Sankranthi festival.

నందమూరి బాలకృష్ణుడు తెరపైనే కాదు.. తెరవెనుక కూడా హీరోనే. తెరపైన రాజసాన్ని అద్భుతంగా ప్రదర్శించే బాలయ్య.. నిజజీవితంలో కూడా అదే రేంజ్ రాయల్టీని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన తండ్రి నందమూరి తారకరామారావు వారసత్వ లక్షణం అది అని అందరూ చెప్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి హీరోయిజాన్ని చూపించాడు బాలయ్య.

సంక్రాంతి బరిలో ఉన్న రెండు భారీ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఉన్న క్లాష్ గురించి అందరికీ తెలిసిందే. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య అభిమానులైతే పందెం పుంజుల రేంజ్‌లో ఢీ కొట్టాలనే అభిప్రాయపడుతున్నారు. అయితే శాతకర్ణి సినిమా ప్రొడ్యూసర్ క్రిష్ మాత్రం పోటీపై అంత ఆసక్తికరంగా లేడు. మెగా ఫ్యామిలీతో క్లాష్ అంటే కెరీర్‌కి నష్టం అన్న విషయం క్రిష్‌కి తెలుసు. అందుకే రీసెంట్ టైమ్స్ వరకూ క్రిష్ పైన ఒత్తిడి తెచ్చిన బాలయ్య అభిమానులు.. అక్కడ పనవ్వదని తెలుసుకుని డైరెక్ట్‌గా బాలయ్యనే అప్రోచ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి సినిమాకు పోటీగా 11నే ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయాలని బాలయ్యతో చెప్పారు.

అయితే.. బాలకృష్ణ మాత్రం హీరోయిక్‌గా రియాక్ట్ అయ్యాడు. ‘మనం 12న వస్తాం అని చెప్పాం. వాళ్ళు 11కి మార్చుకున్నారు.. ఇంకేముంది.. రిలీజ్ ఎప్పుడయితే ఏంటి? సినిమా ఓ రేంజ్‌లో వచ్చింది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు.. ఇదిరా సంక్రాంతి సినిమా అంటే అనే స్థాయి సినిమా ఇది.. తెలుగువాళ్ళందరూ గర్వపడే స్థాయి సినిమా.. చూసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పి అభిమానులను ఖుషీ చేశాడు బాలయ్య. ఈ విధంగా బాలయ్య కాన్ఫిడెన్స్ అండ్ ఇష్యూని డీల్ చేసిన విధానం గురించి తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు కూడా.. దటీజ్ రాయల్ బాలయ్య అని ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news