Gossipsబాలయ్య రీమేక్ మూవీ... మళ్ళి సింహ గర్జన మొదలైయింది..

బాలయ్య రీమేక్ మూవీ… మళ్ళి సింహ గర్జన మొదలైయింది..

జై సింహా తర్వాత నందమూరి బాలకృష్ణ తన 103వ సినిమా ఎన్.టి.ఆర్ బయోపిక్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఓ కన్నడ రీమేక్ సినిమా చేస్తాడని అంటున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ముఫ్టి సినిమా మీద మనసు పడ్డాడట బాలకృష్ణ.

శివ రాజ్ కుమార్ నటించిన ఆ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్లో ఒకటిగా నిలిచింది. అండర్ కవర్ కాప్, గ్యాంగ్ స్టర్ మధ్య జరిగే కథగా ముఫ్టి సూపర్ హిట్ అయ్యింది. స్క్రీన్ ప్లే బేస్ తో నడిచే ఆ సినిమా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట బాలకృష్ణ. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ పై దృష్టి ఉంచిన బాలయ్య తర్వాత సినిమా డీటేల్స్ త్వరలో వెళ్లడించనున్నారు.

రీమేక్ సినిమా దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. 100వ సినిమాకు కథ చెప్పిన అనీల్ రావిపుడి కూడా బాలకృష్ణతో సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి ఆ కన్నడ రీమేక్ అతని డైరక్షన్ చేస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news