Gossipsఅరాచకమైన రేటుకి ‘బాలయ్య101’ శాటిలైట్ రైట్స్.. ఆ రికార్డ్ పటాపంచలు

అరాచకమైన రేటుకి ‘బాలయ్య101’ శాటిలైట్ రైట్స్.. ఆ రికార్డ్ పటాపంచలు

ఓ ప్రాజెక్ట్ ఎవరూ ఊహించని ఒక కాంబినేషన్ సెట్ అయితే.. దానికి మొదటినుంచే ఎనలేని క్రేజ్ వచ్చిపడుతుంది. ఎంతలా అంటే.. ఫస్ట్‌లుక్ రిలీజ్ కాకముందే దాని రైట్స్ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్, టీవీ యాజమాన్యాలు ఎగబడతారు. ఇప్పుడు ‘బాలయ్య 101’ సినిమాకి అలాంటి క్రేజే నెలకొంది. ఈ ప్రాజెక్ట్ కోసం డ్యాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, బాలయ్య తొలిసారి జతకట్టడం వల్ల.. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో.. ఇంకా ఫస్ట్‌లుక్ రిలీజవ్వకముందే ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేస్తోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని అక్షరాల రూ.9.15 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది బాలయ్య కెరీర్‌లో రికార్డ్ ఫిగర్. అంతకుముందు ఆయన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూ.7.6 కోట్లకు అమ్ముడుపోయి, సంచలనం సృష్టించింది. ఇప్పుడా రికార్డ్‌ని తన 101వ సినిమాతో బాలయ్య బద్దలుకొట్టేశాడు. ఇందులో బాలయ్య క్రెడిట్ ఎంతుందో.. పూరీది కూడా అంతే వుంది. దీన్ని బట్టి.. ఈ సినిమా మీద ఏ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి.. వాటిని రీచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే, రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news