Gossipsబాలయ్యతో మెగా నిర్మాత.. ఇంత ఇష్యూ జరిగాక కూడా..!

బాలయ్యతో మెగా నిర్మాత.. ఇంత ఇష్యూ జరిగాక కూడా..!

యెల్లో మీడియా మీద ఓ పక్క పవన్ ధ్వజమెత్తుతుంటే మొన్నమధ్య పవన్ మీద కుట్రపూరిత చర్యలు చేస్తున్న ఆర్జివి మీద కూడా తన భావన ప్రకటించాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పవన్ ఫిల్మ్ చాంబర్ కు వచ్చిన మరుసటి రోజు సినిమా హీరోలు, నిర్మాతలు కలిసి ఓ మీటింగ్ ఏర్పాటుచేసుకున్నారు. చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో బాలకృష్ణ డుమ్మా కొట్టాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ మీటింగ్ కు బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగానే రాలేదన్న టాక్ వచ్చింది. విమర్శించేది యెల్లో మీడియానే కాబట్టి ఈ విషయంపై జోక్యం చేసుకోదలచుకోలేదని అనుకున్నారు. ఆ గొడవ పక్కన పెడితే బాలకృష్ణ అల్లు అరవింద్ కలిసి బోయపాటి శ్రీను సోదరుడు బ్రహ్మానందరావు కూతురు తేజస్విని పెళ్లికి వచ్చారు.

వారి సంభాషణ చాలా సరదాగా మాములుగానే జరగడం విశేషం. ఇది చూస్తుంటే అసలు బాలకృష్ణ ఆరోజు నిజంగానే పని ఒత్తిడి వల్ల రాలేదని చెప్పుకోవచ్చు. అదేమో కాని ఎన్.టి.ఆర్ వస్తున్నాడు కాబట్టే బాలకృష్ణ రాలేదన్న మాట మాత్రం బాగా వినపడ్డది. లోపల ఏం జరుగుతుందో తెలియదు కాని బయటకు మాత్రం స్టార్స్ అంతా మంచిగానే నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news