Gossipsబాలయ్యకు సర్జరీ.. చేయకుంటే కష్టమే అంటున్నారు..!

బాలయ్యకు సర్జరీ.. చేయకుంటే కష్టమే అంటున్నారు..!

100 సినిమాలను పూర్తి చేసుకున్న బాలయ్య ఆ తర్వాత స్పీడు పెంచాడని తెలిసిందే. శాతకర్ణి రిలీజ్ తర్వాత రోజే పైసా వసూల్ అది పూర్తి కాగానే జై సింహా ఇలా 102 వరకు స్పీడ్ గా లాగించేసిన బాలయ్య పైసా వసూల్ టైంలో భుజానికి గాయమైనా సరే పట్టించుకోకుండా అలానే నటించాడు. అయితే ఇప్పుడు ఆ భునం నొప్పే తిరగపట్టడంతో కచ్చితంగా సర్జరీ అవసరమని అన్నారట డాక్టర్లు.
పైసా వసూల్ తో రిస్కీ షాట్ సైతం డూప్ లేకుండా చేశారు బాలకృష్ణ. ఇక జై సింహాలో కూడా యాక్షన్ సీన్స్ లో రిస్క్ చేసిన మరి నటించారు. అయితే షూటింగ్ టైంలో ఇవన్ని షెడ్యూల్ ను డిస్ట్రబ్ చేస్తాయని చెప్పి ఓర్చుకున్న బాలయ్య భుజం నొప్పి పెరగడంతో డాక్టర్ కు చూపించారట. ఇక లేట్ లేకుండా సర్జరీ చేయాలని లేదంటే ఇంకా నొప్పి పెరిగే అవకాశం ఉందని అన్నారట.
అందుకే కొంతకాలం రెస్ట్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. సర్జరీ పూర్తి చేశాకనే తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నాడట బాలకృష్ణ. తేజ డైరక్షన్ లో తెరకెక్కే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఆగష్టు నుండి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news