Movies‘శాతకర్ణి’ సునామీ ముందు కొట్టుకుపోయిన మహేష్‌బాబు రికార్డ్

‘శాతకర్ణి’ సునామీ ముందు కొట్టుకుపోయిన మహేష్‌బాబు రికార్డ్

Balayya’s prestigious 100 project Gautamiputra Satakarni Breaks superstar Mahesh Babu’s record in USA.

బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అంతాఇంతా కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవగా.. తాజాగా ప్రిన్స్ మహేష్‌బాబుకి సంబంధించిన ఓ రికార్డ్‌ని బద్దలు కొట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1.64 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. దీంతో.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమాల జాబితాలో 8వ స్థానం కైవసం చేసుకుంది. అంతకుముందు ఆ ప్లేస్‌లో మహేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (1.63 మిలియన్ డాలర్స్) ఉండేది. అయితే ‘శాతకర్ణి’ కలెక్షన్ల సునామీ ముందు ఆ సినిమా రికార్డ్ కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు ఆ చిత్రం 9వ స్థానానికి వచ్చి పడింది.

అసలు ఇంతవరకు యూఎస్‌లో ఖాతా తెరువని బాలయ్య.. తన వందోచిత్రంతో తొలిసారి 1 మిలియన్ క్లబ్‌లో చేరడమే కాదు, యూఎస్ రారాజుగా పిలువబడే మహేష్ రికార్డ్‌నే బ్రేక్ చేసి, అక్కడ తనకూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకోవడం విశేషం. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించగా.. శ్రియాశరన్ హీరోయిన్‌గా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news