Moviesమూడవ రోజున కూడా కుమ్మిపడేసిన బాలయ్య.. ఇక్కడ 21 కోట్లు.. అక్కడ...

మూడవ రోజున కూడా కుమ్మిపడేసిన బాలయ్య.. ఇక్కడ 21 కోట్లు.. అక్కడ మిలియన్ డాలర్లు!!

సంక్రాంతి సందర్బంగా ఈనెల 12 న విడుదలైన బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి మంచి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తుంది. ఒకవైపు మెగాస్టార్ ’ఖైదీ నంబర్ 150‘ మరోవైపు ’శతమానం భవతి‘ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ మూడవరోజు కూడా బాలయ్య కలెక్షన్లు కుమ్మేశాడు.అంతే కాదు యూ.ఎస్. లో కూడా మిలియన్ డాలర్ల మార్కుని దాటి ఓవర్సీస్ లోకూడా తన సత్తా చాటాడు.కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగితే బాలయ్య కొద్దిరోజుల్లోనే 50కోట్ల క్లబ్ లోకి చేరటం ఖాయం అంటున్నారు సినీ ట్రేడ్ వర్గాలు. శాతకర్ణి AP/TS లలో 3 రోజుల కలెక్షన్లు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

నైజామ్ : 4.80 కోట్లు
వైజాగ్ : 2.98 కోట్లు
ఈస్ట : 1.40 కోట్లు
వెస్ట : 2.09 కోట్లు
క్రిష్ణా : 1.64 కోట్లు
గుంటూరు : 2.65 కోట్లు
నెల్లూరు : 1.04 కోట్లు
సీడెడ్ : 4.42 కోట్లు

గౌతమి పుత్ర శాతకర్ణి 3 రోజుల మొత్తం కలెక్షన్లు(AP & TS) : 21.02 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news