Moviesబాలయ్య ‘శాతకర్ణి’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు

బాలయ్య ‘శాతకర్ణి’ 16 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు

Balayya’s prestigious 100th project Gautamiputra Satakarni has earned very well at the worldwide boxoffice in it’s 16 days run which is said to record in Hero’s career.

బాక్సాఫీస్ వద్ద ‘శాతకర్ణి’ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడో వారంలోనూ ఈ చిత్రం సంతృప్తికరమైన వసూళ్లతో దూసుకెళుతోంది. ఓవైపు సంక్రాంతి సినిమాలతోపాటు హిందీ మూవీలు తమ సత్తా చాటుకుంటుంటే.. వాటికి ధీటుగా పోటీనిస్తూ అంచనాలకు మించే మంచి కలెక్షన్లు రాబడుతోంది. కేవలం వీకెండ్స్‌లోనే కాదు.. వీక్ డేస్‌లోనూ డీసెంట్ వసూళ్లు కలెక్ట్ చేస్తుండడం విశేషం.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో రూ. 62.77 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఈ సినిమా రూ.44.91 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగువారు గర్వించదగేలా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ చారిత్రాత్మక చిత్రం ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడం వల్లే ఇలా కలెక్షన్లు కలెక్ట్ చేస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఏరియాల వారీగా 16 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 11.26
సీడెడ్ : 8.6
ఉత్తరాంధ్ర : 5.92
ఈస్ట్ గోదావరి : 3.96
వెస్ట్ గోదావరి : 4.20
కృష్ణా : 3.84
గుంటూరు : 4.80
నెల్లూరు : 2.33
ఏపీ+తెలంగాణ : రూ. 44.91 కోట్లు
కర్ణాటక : 4.80
రెస్టాఫ్ ఇండియా : 1.76
ఓవర్సీస్ : 11.30
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 62.77 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news