Gossipsబాలయ్య మాస్టర్ ప్లాన్.. మోక్షజ్ఞ ఎంట్రీకి అతడే డైరెక్టర్?

బాలయ్య మాస్టర్ ప్లాన్.. మోక్షజ్ఞ ఎంట్రీకి అతడే డైరెక్టర్?

Finally Balayya has choosen a director for his son Mokshagna debut film. According to the sources, this movie will go floors on next year and will be produced by Sai Korrapati.

బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి చాలా కేర్ తీసుకుంటూ వస్తున్నారు. ఎంట్రీతోనే కొడుకుని సక్సెస్ బాటలో నడిపించాలన్న ఉద్దేశంతో.. మంచ కథ, దాన్ని సరిగ్గా డీల్ చేయగల దర్శకుడి కోసం వేట ప్రారంభించారు. చివరికి.. ఆ దర్శకుడు దొరకడంతో, మోక్షజ్ఞ ఎంట్రీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. బాలయ్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రిష్.

అవును.. క్రిష్ డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారైందని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘శాతకర్ణి’ షూటింగ్ సమయంలో క్రిష్ పనితీరు నచ్చడంతో.. అతని దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయమై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. తన కొడుకుతో సినిమా చేయమని బాలయ్య అడగ్గానే.. సరేనని క్రిష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ ప్రాజెక్ట్‌ని 2017 చివర్లోగానీ, 2018 మొదట్లోగానీ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి తన వారాహి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

క్రిష్‌లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ద్వారా క్రిష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి.. మొదటి సినిమాతో తన సత్తా చాటుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ అదిరిపోతుందని, యంగ్ హీరోల్లో సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయమని అప్పుడే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

krish-mokshagna

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news