Gossipsనాగశౌర్య పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!

నాగశౌర్య పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!

నాగ శౌర్య హీరోగా వెంకీ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛలో. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా పిలిచి సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసుకున్న నాగ శౌర్య ఈవెంట్ కు వచ్చిన మెగాస్టార్ ను పొగిడి మిగతా ఫ్యాన్స్ కు కంటయ్యాడు.

మెగాస్టార్ నెంబర్ 1, ఆ తర్వాత 2, 3, 4 ఉన్నాయంటూ. ఆయన లేనప్పుడు అందరు నిలుచున్నారని.. ఇప్పుడు మళ్లీ వచ్చారు ఆ కుర్చీ ఆయనదే అని అన్నాడు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటూ హంగామా చేశారు. అయితే వేదిక దిగిన నాగ శౌర్య జై బాలయ్య, జై ఎన్.టి.ఆర్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్, జై అనుష్క అంటూ చెప్పాడు.

ఇదవరకు ఇంటర్వ్యూస్ లో ఎన్.టి.ఆర్ అభిమాని అంటూ చెప్పిన నాగ శౌర్య చిరు నెంబర్ 1 అని పొగడ్తలతో ముంచెత్తడం బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చలేదు. అయితే ర్యాంకులెలా ఉన్నా చిరు, బాలయ్య యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారని తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news