Gossipsబాలయ్య అభిమానులకి కొత్త భయం పట్టుకుంది

బాలయ్య అభిమానులకి కొత్త భయం పట్టుకుంది

గత కొన్నేళ్లలో ఒక్క ‘టెంపర్’ను మినహాయిస్తే పూరి జగన్నాథ్ నుంచి యావరేజ్ మూవీలు కూడా రాలేదు. దానికి ముందు వెనుక డిజాస్టర్లే తీశాడు పూరి. ‘టెంపర్’ స్క్రిప్టు కూడా ఆయనది కాదన్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలు చూశాక పూరి వీరాభిమానుల్లో కూడా ఆయన మీద నమ్మకం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ పూరితో జట్టు కట్టాలనుకోవడం చూసి ఆయన అభిమానుల్లో కంగారు మొదలైంది. ఐతే ఇది జస్ట్ రూమరే అనుకుంటుంటే.. హడావుడిగా సినిమా మొదలుపెట్టేసి షాకిచ్చాడు బాలయ్య. అయితే గత శుక్రవారం విడుదలైన రోగ్ మూవీతో మినుకు మినుకు మంటున్న ఆశలు సైతం ఆవిరయ్యాయి. బాలయ్యతో సినిమా అన్నా జాగ్రత్తగా తీస్తాడా లేక తన ఫార్ములా ప్రకారమే వెళ్తాడా అన్నది సినిమా విడుదల అయ్యేదాకా వేచి చూడాల్సిందే!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news