Gossipsనిర్మాతగా మారనున్న బాలయ్య... హీరో ఎవరో తెలిస్తే షాకె ..!

నిర్మాతగా మారనున్న బాలయ్య… హీరో ఎవరో తెలిస్తే షాకె ..!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ  2018 సినీ రంగ ప్రవేశం చేస్తారని  ఆ మధ్య అనౌన్స్ చేసారు బాలయ్య . అప్పటినుండి  ఈ సినిమాకు ఆ దర్శకుడు , ఈ నిర్మాత అంటూ  పలు ఊహాగానాలు వినబడుతున్నాయి .

తాజాగా ఈ చిత్రం పై మరో వార్త టాలీవుడ్ వర్గాల ద్వారా బయటకు వచ్చింది . బాలకృష్ణ నే ఆ  చిత్రాన్ని నిర్మించి , మోక్షజ్ఞ ను లాంచ్ చేయనున్నారట .

ఈ చిత్రానికి గాను బాలయ్య చాల కధలు విన్నారట . పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నారట . అయితే బారి యాక్షన్ సన్నీ వేశాలు , బారి డైలాగ్స్ , మాస్ యాక్షన్ ప్యాకెడ్ వంటి జోనర్స్ కాకుండా సింపుల్ లవ్ స్టోరీ ని ట్రై చెయ్యాలని బాలయ్య ఆలోచనట . అభిమానులు బాలయ్య పుత్రరత్నం నుండి బారి డైలాగ్లతో , ఫైట్స్ తో సినిమా మాస్ గ ఉండాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారన్న విషయం బాలయ్యకు తెలుసు , కానీ నాగార్జున తనయుడు అఖిల్ లాంచ్ విషయం లో చేసిన తప్పిదం బాలయ్య చెయ్య తలుచుకోలేదట .  బాలయ్య చాల సింపుల్ గ వుండే స్టోరీ ని ఎంచుకొనే అవకాశం ఉందని వినికిడి.

ఇప్పటికే రాజామౌళి , క్రిష్ లాంటి పెద్ద దర్సుకుల పేర్లు వినబడుతున్న , ఇంకా దర్శకుడిని కంఫర్మ్ చెయ్యలేదు .  బాలయ్య ఈ సినిమా కి సాయి కొర్రపాటి తో కలిసి సహా నిర్మాతగా ఉండాలని నిర్ణయించారట .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news